బిల్లుల మంజూరుకు రూ.25 వేలు లంచం
ABN , Publish Date - May 23 , 2026 | 05:13 AM
బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ
నర్సాపూర్, మే 22 (ఆంధ్రజ్యోతి): బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ పరిధిలో ఒక కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించి రూ.3,13,882 బిల్లులు రావాల్సి ఉంది. ఈ బిల్లులను క్లియర్ చేయడానికి ఏడీఈ రమణారెడ్డి సదురు కాంట్రాక్టర్‌ను రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని, రూ.25 వేలు ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్.. ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం నర్సాపూర్ ఏడీఈ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ నుంచి రమణారెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం రమణారెడ్డిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.