POCSO Act: చిన్నారిపై గ్యాంగ్‌రేప్.. ఆపై టెర్ర్‌సపై నుంచి తోసి హత్య
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:29 AM
ఇంటిపై అద్దెకు ఉండే ఇద్దరు వ్యక్తులే ఆ చిన్నారి పాలిట కీచకులయ్యారు. టెర్ర్‌సపైకి ఆడుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.....
యూపీలో ఘోరం..పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుల కాల్పులు
లఖ్‌నవూ, జనవరి 3: ఇంటిపై అద్దెకు ఉండే ఇద్దరు వ్యక్తులే ఆ చిన్నారి పాలిట కీచకులయ్యారు. టెర్ర్‌సపైకి ఆడుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు టెర్ర్‌సపై నుంచి ఆమెను తోసేసి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో శుక్రవారం ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు రాజు, కశ్య్‌పలపై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన సీనియర్ ఎస్పీ.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్రిస్ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో ఇద్దరు నిందితులు దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసేందుకు వెళ్లగా కాల్పులు జరిపి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. నిందితులు గాయపడ్డారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు.