Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.4.8 కోట్ల హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టివేత

ABN , Publish Date - May 23 , 2026 | 05:11 AM

బ్యాంకాక్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న హైడ్రోఫోనిక్‌ గంజాయిని కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.4.8 కోట్ల హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టివేత

  • 10 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు

శంషాబాద్‌ రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకాక్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న హైడ్రోఫోనిక్‌ గంజాయిని కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకాక్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ ప్రయాణికుడి బ్యాగులను తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు 10 కేజీల హైడ్రోఫోనిక్‌ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పట్టుబడిన గంజాయిని సీజ్‌ చేశారు. దీని విలువ సుమారు రూ.4.8 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 23 , 2026 | 05:11 AM