Share News

మంత్రి తెలుసని రూ. 1.70 కోట్ల మోసం

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:44 AM

నీటిపారుదల శాఖ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఓ ప్రాజెక్టుకు అనుమతి ఇప్పిస్తానని నమ్మబలికి ఓ కంపెనీ యజమానిని...

మంత్రి తెలుసని రూ. 1.70 కోట్ల మోసం

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఓ ప్రాజెక్టుకు అనుమతి ఇప్పిస్తానని నమ్మబలికి ఓ కంపెనీ యజమానిని రూ. 1.70 కోట్ల మేర మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్‌కు చెందిన గ్రీన్‌ మెట్రో ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ దుండిగల్‌లో ఓ ప్రాజెక్ట్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పురిమెట్ల బంగారు యాదవ్‌ అనే వ్యక్తి 2024లో సంస్థ డైరెక్టర్‌ బొడ్డు అశోక్‌ను కలిసి తనకు నీటి పారుదల శాఖలో ఉన్నతాధికారులు, మంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రాజెక్టు అనుమతులు, ఎన్‌ఓసీ ఇప్పిస్తానంటూ 1.70 కోట్ల రూపాయలు, ఐఫోన్‌, హ్యుందాయ్‌ అల్కజార్‌ కారును తీసుకున్నాడు. 18 నెలలు గడిచినా పని పూర్తి చేయకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 04:44 AM