Share News

హత్య కేసులో 12 మందికి జీవితఖైదు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:48 AM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు.

హత్య కేసులో 12 మందికి జీవితఖైదు

నంద్యాల, క్రైం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు. చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరి 22 రాత్రి పాతకక్షల నేపథ్యంలో ఇంజేటి కృష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జునరెడ్డి, మామ రామ సుబ్బారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. 19 మందిపై కేసు నమోదు చేయగా, విచారణ సమయంలోనే ఏడుగురు నిందితులు మరణించారు. మిగిలిన 12 మందిపై నేరం రుజువు కావడంతో కోర్టు జీవితఖైదు విధించింది. జీవితఖైదు పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. నిందితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - Mar 31 , 2026 | 05:50 AM