జొమాటో హైదరాబాద్ సెంటర్ మూసివేత
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:41 AM
జొమాటో పేరుతో ఫుడ్ డెలివరీ యాప్‌ను నిర్వహిస్తున్న ఎటర్నల్.. హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను...
హైదరాబాద్: జొమాటో పేరుతో ఫుడ్ డెలివరీ యాప్‌ను నిర్వహిస్తున్న ఎటర్నల్.. హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను మూసివేసింది. వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంలోనే ఈ సెంటర్‌ను మూసివేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ సెంటర్‌ను మూసివేయటంతో దాదాపు 250 మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అన్ని సేవలను ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ నుంచే చేపట్టాలని కంపెనీ భావిస్తోంది.