జెప్టో రూ.11,000 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:11 AM
తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రక్రియలో భాగంగా ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో మంగళవారం సెబీకి నవీకరించిన ప్రాథమిక ముసాయిదా పత్రాలను (యూడీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది...
తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రక్రియలో భాగంగా ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో మంగళవారం సెబీకి నవీకరించిన ప్రాథమిక ముసాయిదా పత్రాలను (యూడీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ లో భాగంగా ఈ కంపెనీ రూ.8,010 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన 11.35 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా విక్రయించనుంది. ఐపీఓ ద్వారా మొత్తంగా రూ.11,000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జెప్టో వ్యవస్థాపకులకు ఈడీ సమన్లు కంపెనీ వ్యవస్థాపకులు అదిత్ పలిచా, కైవల్య వోహ్రాకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఫారిన్ ఎక్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం (ఫెమా)లో భాగంగా కంపెనీలో విదేశీ పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు, కంపెనీ వ్యాపారంపై సమాచారంతో పాటు పత్రాలు, పద్దులను ఈడీ కోరిందని సెబీకి సమర్పించిన ముసాయిదాలో వెల్లడించింది.