టోకు ధరల ద్రవ్యోల్బణానికి రెక్కలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:21 AM
ఆహార, ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణంపై పడింది. దీంతో ఫిబ్రవరిలో...
ఫిబ్రవరిలో 2.13 శాతం
న్యూఢిల్లీ: ఆహార, ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణంపై పడింది. దీంతో ఫిబ్రవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 2.13 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది నాలుగో నెల. టోకు ద్రవ్యోల్బణం జనవరి నెలలో 1.81%, గత ఏడాది ఫిబ్రవరిలో 2.45ు ఉంది. ఫిబ్రవరిలో ఆహార వస్తువుల ధరలు 2.19% పెరిగాయి.