వోల్వో కార్ల ధరలు పెంపు
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:08 AM
స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్.. భారత్‌లో తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి...
ముంబై: స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్.. భారత్‌లో తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపింది. మే 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాలో అంతరాయాలు, రూపా యి పతనంతో ఇన్‌పుట్ వ్యయాలు భారంగా మారాయని, దీంతో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?
'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..