వొడాఫోన్ ఐడియాకు రూ.33,425 కోట్ల ‘రుణ’ సాయం
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:42 AM
పీకల్లోతు నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కొత్త జవసత్వాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దేశీయ టెలికాం...
న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కొత్త జవసత్వాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దేశీయ టెలికాం ఆపరేటర్‌కు పదేళలో చెల్లించేలా 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.33,425 కోట్లు) రుణ సాయం అందించేందుకు ఎస్‌బీఐ నాయకత్వంలో కొన్ని బ్యాంకులు అంగీకరించినట్టు సమాచారం. అయితే ఈ రుణ చెల్లింపులకు హామీ ఇవ్వడంతో పాటు రుణ చెల్లింపు ముగిసే వరకు కుమార మంగళం బిర్లా వొడాఫోన్ ఐడియా చైర్మన్‌గా కొనసాగాలని బ్యాంకులు షరతు విధించినట్టు తెలుస్తోంది. ఈ రుణ మొత్తాన్ని నెట్‌వర్క్ విస్తరణకు ఉపయోగించి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో పోటీపడాలని వొడాఫోన్ భావిస్తున్నట్టు సమాచారం.