వియాష్ సైంటిఫిక్ చేతికి ఇటలీ కంపెనీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:37 AM
హైదరాబాద్ కేంద్రం గా ఉన్న వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ (వీఎ్‌సఎల్) యూరప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది...
రూ.188 కోట్లకు బీఎఫ్ఎల్ కొనుగోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రం గా ఉన్న వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ (వీఎ్‌సఎల్) యూరప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటలీ కేంద్రంగా పనిచేసే బయోఫర్‌లైఫ్ (బీఎ్‌ఫఎల్) అనే పెంపుడు జంతువుల ఆహార, సంరక్షణ ఉత్పత్తుల తయారీ కంపెనీని రూ.188 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. అలివిరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా వీఎ్‌సఎల్ ఈ కొనుగోలు చేసింది. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ కోసం వాడే జెనరిక్ ఔషధాలకు భారీగా పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఈ ఇటలీ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్టు వీఎ్‌సఎల్ ఎండీ, సీఈఓ హరిబాబు తెలిపారు.