జింబాబ్వేలో వియోనా ఫిన్‌టెక్ సేవలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:30 AM
స్థానిక పేమెంట్ టెక్నాలజీ సేవల సంస్థ వియోనా ఫిన్‌టెక్ తన సేవలను ఆఫ్రికాలోని జింబాబ్వే దేశానికీ విస్తరిస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక పేమెంట్ టెక్నాలజీ సేవల సంస్థ వియోనా ఫిన్‌టెక్ తన సేవలను ఆఫ్రికాలోని జింబాబ్వే దేశానికీ విస్తరిస్తోంది. త్వరలో ప్రారంభించే ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత ట్యాప్ అండ్ పే సేవలను అక్కడ ప్రవేశపెట్టేందుకు ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు వియోనా ఫిన్‌టెక్ వ్యవస్థాపకులు, సీఈఓ యార్లగడ్డ రవీంద్రనాథ్ తెలిపారు.