ఎన్‌పీసీఐ నుంచి భారత్ బిల్‌పే సర్టిఫికేషన్
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:23 AM
ఎన్‌పీసీఐ సర్టిఫైడ్ టెక్నాలజీ ఆధారిత సేవలందించే హైదరాబాద్ ఫిన్‌టెక్ కంపెనీ వియోనా ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన...
వియోనా ఫిన్‌టెక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎన్‌పీసీఐ సర్టిఫైడ్ టెక్నాలజీ ఆధారిత సేవలందించే హైదరాబాద్ ఫిన్‌టెక్ కంపెనీ వియోనా ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో బిల్ పేమెంట్ సేవలు కూడా అందించనుంది. ఇందుకోసం కంపెనీ ఎన్‌పీసీఐ అనుబంధ సంస్థ ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ నుంచి బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ (బీఓయూ) సర్టిఫికేషన్ పూర్తి చేసినట్టు తెలిపింది. ఈ సర్టిఫికేషన్‌తో భారత్ బిల్‌పే నెట్‌వర్క్ ద్వారా ప్రజా వినియోగ సేవలు (యుటిలిటీస్), బీమా,ఆర్థిక సేవల చెల్లింపులను కంపెనీ స్వీకరించగలుగుతుంది.