విమ్టా లాబ్స్ లాభం రూ.21.1 కోట్లు
ABN , Publish Date - May 07 , 2026 | 06:17 AM
విమ్టా లాబ్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విమ్టా లాబ్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.112 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.21.1 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.96.1 కోట్ల ఆదాయంపై రూ.18.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. లాభాల వృద్ధి నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. కాగా ఐదేళ్ల కాలానికి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్‌పీ వాసిరెడ్డి పునర్నియామకానికి బోర్డు సిఫారసు చేసింది.