ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి విన్‌ఫాస్ట్
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:48 AM
వియత్నాంకు చెంది న విద్యుత్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది.
న్యూఢిల్లీ: వియత్నాంకు చెంది న విద్యుత్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ఇందుకోసం సంస్థకు చెందిన టూవీలర్ విభాగం దేశంలో షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు 50కి పైగా డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ తెలంగాణ, ఏపీ సహా 15 రాష్ట్రాలోని 34 నగరాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో షోరూమ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. విన్‌ఫాస్ట్ ఇప్పటికే ఇండియాలో వీఎఫ్ 6, వీఎఫ్ 7, లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.