Share News

అక్కడ వార్‌.. ఇక్కడ బేర్‌..!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:23 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఈ యుద్ధ భయాందోళనల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు...

అక్కడ వార్‌.. ఇక్కడ బేర్‌..!

  • అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ యుద్ధం..

  • సెన్సెక్స్‌ 1,677 పాయింట్లు పతనం

  • 24,000 దిగువకు జారుకున్న నిఫ్టీ

  • 3 నెలల్లో సూచీలకు అతిపెద్ద నష్టం

  • రూ.8.96 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • నెల కనిష్ఠ స్థాయికి రూపాయి క్రాష్‌

  • ఒక్కరోజులోనే 52 పైసలు డౌన్‌

  • 80 డాలర్లకు ముడిచమురు

ముంబై: అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఈ యుద్ధ భయాందోళనల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు బుధవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇరాన్‌తో మధ్యంతర శాంతి ఒప్పందం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులూ తోడయ్యాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కంపెనీల ఆర్థిక ఫలితాలు మందగించవచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకోవడానికి మొగ్గుచూపుతూ అమ్మకాల బాట పట్టారు. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,677.12 పాయింట్ల నష్టంతో (2.15 శాతం) 76,503.60 వద్దకు పడిపోయింది. ఇంట్రాడేలో ఈ సూచీ 1,9121.69 పాయింట్లు కోల్పోయి 76,259.03 వద్దకు చేరింది. తర్వాత కాస్త కోలుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 516.65 పాయింట్లు (2.12 శాతం) దిగజారి 23,882.05 వద్ద క్లోజైంది. గడిచిన మూడు నెలల్లో సూచీలకిదే అతిపెద్ద ఒక్క రోజు నష్టం. ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఒక్క రోజులో రూ.8.96 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.471.23 లక్షల కోట్లకు (4.95 ట్రిలియన్‌ డాలర్లు)కు తగ్గిపోయింది.

మరింత తగ్గిన బంగారం

ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,48,450కు చేరుకుంది.


  • సెన్సెక్స్‌లోని మొత్తం 30షేర్లు నష్టాలతోనే ముగిశాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, మారుతి, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.

  • బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 2.14 శాతం, స్మాల్‌ క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 1.61 శాతం నష్టపోయాయి.

  • అన్ని రంగాల సూచీలు నష్టాలతో ముగిశాయి. సర్వీసెస్‌ 3.21ు, పీఎ్‌సయూ బ్యాంక్‌ 2.76% నష్టపోయాయి.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) రూ.1,962.80 కోట్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.790.16 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

ఓఎంసీ, ఏవియేషన్‌ షేర్లు విలవిల: ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇంధన విక్రయ, పెయింట్‌ తయారీ, విమానయాన సంస్థల షేర్లు బుధవారం నష్టాలను నమోదుచేశాయి. బీఎ్‌సఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు 4.60 శాతం, ఐవోసీ 3.51 శాతం, బీపీసీఎల్‌ 3.20 శాతం క్షీణించాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ షేరు 5.02 శాతం, స్పైస్‌జెట్‌ షేరు 3.04 శాతం తగ్గాయి. ఇక శాలిమార్‌ పెయింట్స్‌ షేరు 4.44 శాతం, ఇండిగో పెయింట్స్‌ షేరు 4.18 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ షేరు 2.49 శాతం నష్టపోయాయి.

క్రూడ్‌ భగ్గు

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ్టఒకదశలో 8.45 శాతం పెరిగి 80.41 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియాలో తాజా దాడులతో హోర్ముజ్‌ జలసంధి ద్వారా ముడి చమురు సరఫరా మళ్లీ స్తంభించిపోనుందన్న ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి.

అయ్యో రూపాయే..

డాలర్‌ మారకంలో రూపాయి విలువ నెల రోజుల కనిష్ఠ స్థాయికి పతనమైంది. బుధవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 52 పైసలు క్షీణించి 95.48 వద్ద ముగిసింది. హోర్ముజ్‌ జలసంధిలో నౌకలపై ట్రెహాన్‌ దాడులు చేయడంతో అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగింది. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదలకు, డాలర్‌ బలపడటానికి దారితీసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పతనం కూడా రూపాయిపై ఒత్తిడిని కలిగించినట్టు ఫారెక్స్‌ ట్రేడర్లు చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 04:23 AM