యూపీఐకి రక్షాబంధన్ జోష్
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:11 AM
డిజిటల్ చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 2,451 కోట్ల...
ఆగస్టులో 2,451 కోట్ల లావాదేవీలు
విలువ రూ.29.8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 2,451 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.29.8 లక్షల కోట్లు. ఈ నెలలో లావాదేవీలు జోరుగా సాగడానికి ప్రధానంగా రక్షాబంధన్ దోహదపడినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. గత మే, జూలై నెలల్లో రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ.29.9 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణపరంగా చూస్తే ఈ ఏడాది మే నెలలో 2,320 కోట్లు, జూన్‌లో 2,272 కోట్లు, జూలైలో 2,366 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా ఆగస్టులో రికార్డు స్థాయిలో 2,451 కోట్లకు పెరిగాయి. విలువపరంగా గత ఏడాది ఆగస్టులో నమోదైన రూ.24.85 లక్షల కోట్ల విలువైన లావాదేవీలతో పోల్చితే 20 శాతం వార్షిక వృద్ధితో ఈ ఏడాది ఆగస్టులో రూ.29.82 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇదే సమయంలో యూపీఐ లావాదేవీల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 22 శాతం పెరిగి 1,963 కోట్ల నుంచి 2,451 కోట్లకు చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..