Share News

జన ఎస్‌ఎఫ్‌బీలో టీవీఎస్‌ వేణు గ్రూప్‌నకు 9.9 శాతం వాటా

ABN , Publish Date - May 19 , 2026 | 01:51 AM

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో 9.9 శాతం వాటాను టీవీఎస్‌ వేణు గ్రూప్‌ కొనుగోలు చేయబోతోంది. అందులో భాగంగా...

జన ఎస్‌ఎఫ్‌బీలో టీవీఎస్‌ వేణు గ్రూప్‌నకు 9.9 శాతం వాటా

న్యూఢిల్లీ: జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో 9.9 శాతం వాటాను టీవీఎస్‌ వేణు గ్రూప్‌ కొనుగోలు చేయబోతోంది. అందులో భాగంగా బ్యాంక్‌లో 4.9 శాతం వాటాను రూ.193.32 కోట్లకు దక్కించుకోబోతున్నట్లు ఈ గ్రూప్‌లో భాగమైన టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ లిమిటెడ్‌ సోమవారం వెల్లడించింది. ప్రైమరీ వారంట్ల జారీ, సెకండరీ మార్కెట్‌ కొనుగోలు ద్వారా ఈ డీల్‌ జరగనున్నట్లు తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఈ వాటా కొనుగోలు లావాదేవీ పూర్తి కావచ్చని అంచనా.

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 19 , 2026 | 01:51 AM