Share News

1601 నంబరు సిరీస్‌

ABN , Publish Date - Aug 11 , 2026 | 03:57 AM

అవాం ఛిత కాల్స్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎ్‌సఐ), ప్రభుత్వరంగాలు కాకుండా...

1601 నంబరు సిరీస్‌

యుటిలిటీస్‌, లాజిస్టిక్స్‌ కంపెనీలకు

సర్వీసు, లావాదేవీల కాల్స్‌కు వాడాలని ట్రాయ్‌ ఆదేశం

ప్రచార కాల్స్‌కు వాడొద్దని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: అవాం ఛిత కాల్స్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎ్‌సఐ), ప్రభుత్వరంగాలు కాకుండా ఇతర రంగాల సంస్థలు చేసే లావాదేవీ, సేవా సంబంధిత కాల్స్‌ కోసం ప్రత్యేకంగా 1601 నంబరు సిరీ్‌సను వాడాలని సోమవారం ఆదేశించింది. ఈ మేరకు తొలి దశలో యుటిలిటీస్‌ (వినియోగ సేవలు), కొరియర్‌, లాజిస్టిక్స్‌ రంగాల సంస్థల సర్వీస్‌, లావాదేవీ కాల్స్‌ను 1601 నంబరు సిరీస్‌ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ సిరీస్‌ను ఏ సంస్థ కూడా ప్రచార సంబంధిత వాయిస్‌ కాల్స్‌ కోసం వాడరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం బీఎ్‌ఫఎ్‌సఐ రంగంతోపాటు ప్రభుత్వ సంస్థల సర్వీసు, లావాదేవీ కాల్స్‌ కోసం 1600 సిరీస్‌ నంబర్లను కేటాయించారు. ఈ సంస్థల కమ్యూనికేషన్లు చాలా కీలకమైనవి, సున్నితమైనవి కావడంతో వాటికి సంబంధించిన ముఖ్యమైన లావాదేవీల కాల్స్‌ ఇతర రంగాల సేవా కాల్స్‌తో కలిసిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇతర రంగాల కోసం ప్రత్యేకంగా 1601 సిరీ్‌సను జారీ చేసినట్టు ట్రాయ్‌ పేర్కొంది. బీఎ్‌ఫఎ్‌సఐ సంస్థలు 1600 సిరీ్‌సను విస్తృతంగా వాడిన అనుభవం ఆధారంగా ఇతర రంగాలకు కూడా అదే తరహా నంబరింగ్‌ విధానాన్ని విస్తరించాలని ట్రాయ్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఎఫ్‌ఎ్‌సఐ, ప్రభుత్వ రంగాలు కాకుండా ఇతర రంగాల సంస్థలు చేసే కాల్స్‌ కోసం టెలికాం శాఖ కేటాయించిన 1601 సిరీస్‌ను దశల వారీగా అమలుకు శ్రీకారం చుట్టినట్టు ట్రాయ్‌ తెలిపింది.

Updated Date - Aug 11 , 2026 | 03:57 AM