Share News

1600 నంబర్‌ సిరీస్‌ కాల్స్‌ను ఏ యాప్‌ బ్లాక్‌ చేయలేదు..

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:59 AM

నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం ప్రజలకు సమాచారం అందించేందుకు, సంప్రదింపులు జరిపేందుకు 1600 నంబర్‌ సిరీస్‌ నుంచి చేసే ఫోన్‌ కాల్స్‌ను ఏ యాప్‌ కూడా నిరోధించలేదని...

1600 నంబర్‌ సిరీస్‌ కాల్స్‌ను ఏ యాప్‌ బ్లాక్‌ చేయలేదు..

  • 140 నంబర్‌ సిరీస్‌ కాల్స్‌ను సైతం..

  • ట్రాయ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం ప్రజలకు సమాచారం అందించేందుకు, సంప్రదింపులు జరిపేందుకు 1600 నంబర్‌ సిరీస్‌ నుంచి చేసే ఫోన్‌ కాల్స్‌ను ఏ యాప్‌ కూడా నిరోధించలేదని టెలికాం రంగ నియంత్రణ మండలి ట్రాయ్‌ శుక్రవారం వెల్లడించింది. ప్రత్యేక సిరీస్‌ నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడం, లేబుల్‌ చేసే విషయంలో ట్రూకాలర్‌ యాప్‌తో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ట్రాయ్‌ ఈ ప్రకటనను జారీ చేసింది. ‘‘టెలికాం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్‌ (టీసీసీసీపీఆర్‌) ప్రకారం.. 1600 సిరీస్‌ నుంచి వచ్చే కాల్స్‌ను ట్యాగ్‌ చేయడం, బ్లాక్‌ చేయడం లేదా ఫిల్టర్‌ చేయడం వంటివి అనుమతించబడవు’’ అని ప్రకటనలో పేర్కొంది.

ప్రత్యేకంగా లావాదేవీలు, సేవల కోసమే..

ప్రభుత్వ నియంత్రణ మండళ్లు ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ, పీఎ్‌ఫఆర్‌డీఏ నియంత్రణ పరిధిలోని బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలు తమ సేవలు, లావాదేవీలకు సంబంధించి కస్టమర్లకు లేదా ప్రజలకు ఫోన్‌ కాల్స్‌ చేసేందుకు 1600 సిరీస్‌ నంబర్లను కేటాయించినట్లు ట్రాయ్‌ పేర్కొంది. అలాగే, 140 నంబర్‌ సిరీస్‌ నుంచి వచ్చే ప్రచార ఫోన్‌ కాల్స్‌ను కూడా యాప్‌లు నిరోధించలేవని.. తమ నియంత్రణలోని డీఎన్‌డీ (డు నాట్‌ డిస్టర్బ్‌) రిజిస్ట్రీ మాత్ర మే ఈ సిరీస్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేయగలుగుతుందని ట్రాయ్‌ స్పష్టం చేసింది. అయితే, టెలికాం వినియోగదారులు 140 నంబర్‌ సిరీస్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేసుకునేందుకు డీఎన్‌డీ రిజిస్ట్రీలో తమ ప్రాధాన్యతను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

స్పామ్‌ కాల్స్‌ వస్తున్నాయ్‌: ట్రూకాలర్‌

కాలర్‌ గుర్తింపు యాప్‌ ట్రూకాలర్‌ సీఈఓ రిషిత్‌ ఝున్‌ఝున్‌వాలా మాత్రం 140, 1600 నంబర్‌ సిరీ్‌సల నుంచి స్పామ్‌ కాల్స్‌ పోటెత్తుతున్నాయని అంటున్నారు. ప్రతి రోజూ ఈ రెండు సిరీ్‌సలకు చెందిన 5.1 కోట్లకు పైగా కాల్స్‌కు వినియోగదారులు స్పందించడం లేదన్నారు. ముఖ్యంగా 1600 సిరీస్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేసేందుకు చర్యలు 2025 అక్టోబరు నుంచి 208 శాతం పెరిగాయన్నారు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 04:59 AM