Share News

టీసీఎస్‌ చేతికి బెస్ట్‌ బయ్‌ జీసీసీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:18 AM

భారత్‌లో అమెరికా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌ ‘బెస్ట్‌ బయ్‌’కి చెందిన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చేజిక్కించుకుంది.

టీసీఎస్‌ చేతికి బెస్ట్‌ బయ్‌ జీసీసీ
TCS

ముంబై: భారత్‌లో అమెరికా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌ ‘బెస్ట్‌ బయ్‌’కి చెందిన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చేజిక్కించుకుంది. అయితే ఎంత మొత్తానికి ఈ జీసీసీని కొనుగోలు చేసిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. బెస్ట్‌ బై జీసీసీ.. టీసీఎస్‌ గూటికి చేరినప్పటికీ సంస్థ అమెరికా రిటైల్‌ వ్యాపారానికి మద్దతును యథాతథంగా కొనసాగిస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఈ సెంటర్‌ను కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత క్యాపబిలిటీ సెంటర్‌గా మార్చనున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది.

Updated Date - Oct 03 , 2026 | 01:18 AM