Share News

టాటా సన్స్‌ లిస్టింగ్‌ తప్పదా..?

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:01 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన అప్పర్‌ లేయర్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)ల తాజా జాబితాలో టాటా సన్స్‌ పేరును కొనసాగించింది...

టాటా సన్స్‌ లిస్టింగ్‌ తప్పదా..?

అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎ్‌ఫసీ జాబితాలో

మరోసారి కంపెనీ పేరును చేర్చిన ఆర్‌బీఐ

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన అప్పర్‌ లేయర్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)ల తాజా జాబితాలో టాటా సన్స్‌ పేరును కొనసాగించింది. అయితే, తన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకునేందుకు టాటా సన్స్‌ ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుపై ఇది ప్రభావం చూపదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కంపెనీ అప్లికేషన్‌ ప్రస్తుతం పరిశీలనలో ఉందని పేర్కొంది. ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోనున్న సంగతిని మాత్రం వెల్లడించలేదు. రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన, కఠిన పర్యవేక్షణ అవసరమైన 17 ఎన్‌బీఎ్‌ఫసీలు, కోర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ (సీఐసీ)ల పేర్లను ఆర్‌బీఐ ఈ లిస్ట్‌లో చేర్చింది. మార్చి చివరి నాటికి టాటా సన్స్‌ ఆస్తుల విలువ రూ.2 లక్షల కోట్ల పైమాటే. టాటా సన్స్‌ ప్రస్తుతం ఎన్‌బీఎ్‌ఫసీలోని సీఐసీ విభాగంలో నమోదై ఉంది.

టాటా లిస్టెడ్‌ కంపెనీల్లో మెజారిటీ పెట్టుబడిదారు: రూ.38 లక్షల కోట్లకు పైగా విలువైన అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీయే టాటా సన్స్‌. టీసీఎస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టాటా పవర్‌, టైటాన్‌ వంటి డజనుకు పైగా లిస్టె డ్‌ టాటా కంపెనీల్లో మెజారిటీ పెట్టుబడిదారు, ప్రమోటర్‌ టాటా సన్సే. వాటి నుంచి లభించే డివిడెండే కంపెనీకి ప్రధాన ఆదాయం.

తొలుత 2002లో జాబితా విడుదల: ఆర్‌బీఐ తొలుత 2022లో విడుదల చేసిన అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎ్‌ఫసీల జాబితాలో టాటా సన్స్‌ పేరును చేర్చింది. తద్వారా కంపెనీ మరింత కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పాలనపరమైన, పెట్టుబడి, సమాచార బహిర్గత నిబంధనలు పాటించేందుకు కంపెనీ తన షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సైతం నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Updated Date - Aug 07 , 2026 | 05:01 AM