Share News

నోయల్‌ టాటా కొర్రీలు..చంద్ర పునర్నియామకం వాయిదా

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:29 AM

టాటా గ్రూప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈమధ్య టాటా ట్రస్ట్‌ బోర్డులో సభ్యుల పునర్నియాకాల విషయంలో విబేధాలు పొడచూపగా..

నోయల్‌ టాటా కొర్రీలు..చంద్ర పునర్నియామకం వాయిదా

  • టాటా సన్స్‌ బోర్డులో మరో ముసలం

ముంబై: టాటా గ్రూప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈమధ్య టాటా ట్రస్ట్‌ బోర్డులో సభ్యుల పునర్నియాకాల విషయంలో విబేధాలు పొడచూపగా.. తాజాగా టాటా సన్స్‌ బోర్డులోనూ అభిప్రాయ బేధాలు వెలుగు చూ శాయి. టాటా సన్స్‌కు మూడోసారి చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై నిర్ణయాన్ని బోర్డు వాయి దా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. ఆ తర్వాత కూడా ఆయన్ని సారథ్య బాధ్యతల్లో కొనసాగించే విషయంపై చర్చించేందుకు మంగళవారం జరిగిన కంపెనీ బోర్డు భేటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, నోయల్‌ టాటా కొర్రీలే ఇందుకు కారణమని తెలిసింది. టాటా సన్స్‌లో 66ు వాటా కలిగిన టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ అయిన నోయల్‌ టాటా.. గ్రూప్‌లోని కొన్ని కంపెనీల నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. బోర్డులోని ఇతర సభ్యులు చంద్రశేఖర్‌ పునర్నియామకానికి మద్దతు పలికారని.. నష్టాలు చవిచూస్తున్నవి కొత్త తరం కంపెనీలని, వాటి వ్యాపారం పరిణతి చెంది లాభాల బాట పట్టేందుకు సమయం పడుతుందని వారు అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓటింగ్‌ ద్వారా పునర్నియామకంపై నిర్ణయం తీసుకుందామని కొందరు సభ్యులు ప్రతిపాదించినప్పటికీ.. చంద్రశేఖరన్‌ స్వయంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు తెలిసింది.

నోయల్‌ నాలుగు షరతులు

ప్రస్తుతం టాటా సన్స్‌ బోర్డులో నోయల్‌ టాటాతోపాటు టీవీఎ్‌సకు చెందిన వేణు శ్రీనివాసన్‌ టాటా ట్రస్ట్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చంద్ర పునర్నియామకాన్ని ఆమోదించేందుకు నోయల్‌ టాటా నాలుగు షరతులను బోర్డు ముందుంచారట.

Updated Date - Feb 25 , 2026 | 02:29 AM