Share News

5జీ కనెక్టివిటీతో టాటా సియెర్రా ఈవీ

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:37 AM

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో సాఫ్ట్‌వేర్‌-డిఫైన్డ్‌ వెహికల్స్‌ (ఎస్‌డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా టాటా కమ్యూనికేషన్స్‌, టాటా మోటార్స్‌...

5జీ కనెక్టివిటీతో టాటా సియెర్రా ఈవీ

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో సాఫ్ట్‌వేర్‌-డిఫైన్డ్‌ వెహికల్స్‌ (ఎస్‌డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా టాటా కమ్యూనికేషన్స్‌, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టీఎంపీవీ) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.త్వరలో విడుదల చేయనున్న ‘సియెర్రా ఈవీ’ ఎస్‌యూవీలో ఇన్‌బిల్ట్‌ 5జీ సెల్యులార్‌ కనెక్టివిటీని అందించనున్నట్లు తెలిపాయి. టాటాకామ్‌కు చెందిన ‘మూవ్‌’ కనెక్ట్‌డ్‌ వెహికల్‌ ప్లాట్‌ఫామ్‌ను సియెర్రా ఈవీకి చెందిన ఎస్‌డీవీ ప్లాట్‌ఫామ్‌ ఎన్‌ఐఓతో అనుసంధానించనున్నారు. దీంతో వాహనంలో నిరంతరాయమైన కనెక్టివిటీతో పాటు కంటెంట్‌ స్ట్రీమింగ్‌, రియల్‌ టైమ్‌ రిమోట్‌ వెహికల్‌ డయాగ్నోస్టిక్స్‌ వంటి డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Aug 26 , 2026 | 05:37 AM