Share News

ఐదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడి: టాటా మోటార్స్‌ పీవీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:21 AM

భారత ఆటోమొబైల్‌ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) భారీ పెట్టుబడి...

ఐదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడి: టాటా మోటార్స్‌ పీవీ

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్‌ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా వ చ్చే ఐదేళ్లలో రూ.40,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. అంతే కాకుండా ప్యాసింజర్‌ వెహికల్‌ మార్కెట్లో 20 శాతం వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు 6 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9 లక్షల యూనిట్లుగా ఉంది. దీనికి మరో 4 లక్షల యూనిట్లను జోడించడంతో రెండు మూడేళ్లలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల యూనిట్లకు చేర్చాలని టాటా మోటార్స్‌ పీవీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 04:21 AM