Share News

రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:27 AM

స్టాక్‌ మార్కెట్‌లో రెండు రోజుల లాభాల కు బ్రేక్‌ పడింది. అమ్మకాలహోరుతో సెన్సెక్స్‌ 1,068.74 పాయింట్ల నష్టంతో 82,225.92 వద్ద ముగిసింది.

రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • నష్టాల్లోకి మార్కెట్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో రెండు రోజుల లాభాల కు బ్రేక్‌ పడింది. అమ్మకాలహోరుతో సెన్సెక్స్‌ 1,068.74 పాయింట్ల నష్టంతో 82,225.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 288.35 పాయింట్ల నష్టంతో 25,424.65 వద్ద క్లోజయింది. బీఎ్‌సఈలో లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ రూ.5 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది.

వెంటాడిన ఏఐ భయాలు: ఐటీ కంపెనీల షేర్ల ను కృత్రిమ మేధ (ఏఐ) భయం మంగళవారం సైతం వెంటాడింది. ఐటీ కంపెనీల షేర్లు మరింతగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ ఆరు శాతం నష్టపోయింది. ఈ నెల ఇప్పటి వరకు ఈ సూచీ 21 శాతం నష్టపోయింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత నిఫ్టీ ఐటీ సూచీ ఒక నెలలో ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. టెక్‌ మహీంద్ర కంపె నీ షేర్లయితే అత్యధికంగా 6.6ు నష్ట పోయాయి.

Updated Date - Feb 25 , 2026 | 02:27 AM