స్టార్ హెల్త్ వర్చువల్ హె ల్త్‌కేర్ సేవలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:30 AM
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో పెరుగుతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకుని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.. వర్చువల్‌గా డాక్టర్ కన్సల్టేషన్స్, హోమ్ హెల్త్‌కేర్ సపోర్ట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో పెరుగుతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకుని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.. వర్చువల్‌గా డాక్టర్ కన్సల్టేషన్స్, హోమ్ హెల్త్‌కేర్ సపోర్ట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. పాలసీదారులయితే 7200 222 333 నంబరుకు కాల్ చేసి హోమ్ హెల్త్‌కేర్, ప్లాన్డ్ హాస్పిటలైజేషన్‌కు సంబంధించిన మార్గదర్శకత్వం పొందవచ్చని తెలిపింది. పాలసీదారులు కాని వారు స్టార్ హెల్త్ కస్టమర్ యాప్ ద్వారా 24/7 వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్స్‌ను ఉచితంగా పొందవచ్చని పేర్కొంది.