స్టాండర్డ్ ఇంజనీరింగ్ లాభంలో 27 శాతం వృద్ధి
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:55 AM
స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌ఈటీఎల్).. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌ఈటీఎల్).. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.252.20 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.26.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 26.6 శాతం వృద్ధి చెందగా ఆదాయం ఏకంగా 41.5 శాతం పెరిగింది. కీలక వ్యాపారాల్లో వృద్ధి పాటు కొత్త ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు పెట్టడంతో జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఏఐ డేటాసెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో పాటు జపాన్‌కు చెందిన జీఎల్ హక్కోతో భాగస్వామ్యాన్ని విస్తరించినట్లు ఎస్‌ఈటీఎల్ తెలిపింది. కాగా విస్తరణ కోసం ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ.136.50 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు