ఏఐ డేటాసెంటర్ ఇంజనీరింగ్‌లోకి స్టాండర్డ్ ఇంజనీరింగ్
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:28 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌ఈటీఎల్).. డేటాసెంటర్ ఇంజనీరింగ్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా...
జీస్కేల్ ఎనర్జీలో 51% వాటా కొనుగోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌ఈటీఎల్).. డేటాసెంటర్ ఇంజనీరింగ్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51ు వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఎస్‌ఈటీఎల్ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. తొలి దశ పెట్టుబడుల్లో భాగంగా రూ.190 కోట్ల మూలధన పెట్టుబడులతో పాటు ప్రస్తుత వాటాదారులతో వ్యూహాత్మక షేర్-స్వాప్ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు. మొత్తం గా జీస్కేల్ కొనుగోలు కోసం ఎస్‌ఈటీఎల్ రూ.500 కోట్లు వెచ్చించనుందన్నారు. వాటా కొనుగోలు, సామర్థ్యాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ మొత్తాలను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. జీస్కేల్ కొనుగోలుకు అవసరమైన మొత్తాలను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకోనున్నట్లు తెలిపారు.నవంబరు నాటికి డేటాసెంటర్ ప్లాట్‌ఫామ్ కార్యకలాపాలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నట్లు రావు పేర్కొన్నారు.