యూనికార్న్‌గా స్క్వేర్ యార్డ్స్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:59 AM
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్.. యూనికార్న్ హోదాను సాధించింది. తన వ్యాపార వృద్ధి, తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఇన్వెస్టర్ల నుంచి...
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్.. యూనికార్న్ హోదాను సాధించింది. తన వ్యాపార వృద్ధి, తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఇన్వెస్టర్ల నుంచి రూ.900 కోట్లు (9.5 కోట్ల డాలర్లు) సమీకరించినట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ విలువను 100 కోట్ల డాలర్లకు పైగా లెక్కగట్టినట్టు తెలుస్తోంది. దీంతో కంపెనీ యూనికార్న్ హోదాను పొందింది. ఒక సంస్థ విలువ వంద కోట్ల డాలర్లు దాటితే దానిని యూనికార్న్‌గా పరిగణిస్తారు. మరోవైపు తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో స్క్వేర్ యార్డ్స్ రూ.2,086 కోట్ల రాబడిని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే వృద్ధి 48 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!