అక్టోబరు 1 నుంచి స్కోడా కార్ల ధరల పెంపు
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:17 AM
రుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ వ్యయాలు భారంగా మారుతుండటంతో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది.
ముంబై: పెరుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ వ్యయాలు భారంగా మారుతుండటంతో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి వాహనాల ధరలను గరిష్ఠంగా 1.2 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంప ులో వ్యత్యాసం ఉంటుందని, గరిష్ఠంగా రూ. 20,000 వరకు పెంపు ఉంటుందని స్కోడా పేర్కొంది.