Share News

రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:49 AM

ఏరోస్పేస్‌, రక్షణ రంగంలోని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌.. రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల విలువైన...

రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల ఆర్డర్‌

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏరోస్పేస్‌, రక్షణ రంగంలోని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌.. రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. ఈ ఆర్డర్‌ కింద రోల్స్‌ రాయిస్‌ తయారు చేసే విమాన ఇంజన్లలో ఉపయోగించే కీలక విడిభాగాలను కంపెనీ సరఫరా చేస్తుంది. ఈ దీర్ఘకాలిక కాంట్రాక్టును ఇటీవల టేకోవర్‌ చేసిన బ్రిటన్‌లోని అనుబంధ కంపెనీ బ్రామ్‌ఫోర్డ్‌ ప్రెసిషన్‌ సొల్యూషన్స్‌ ద్వారా లభించినట్టు కంపెనీ తెలిపింది. ఈ విడిభాగాలను బ్రిటన్‌లోని అనుబంధ కంపెనీతో పాటు భారత్‌లోని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ యూనిట్లలోనూ తయారు చేసి సరఫరా చేయబోతున్నట్టు పేర్కొంది.

Updated Date - Aug 26 , 2026 | 05:49 AM