Share News

శ్రీసిటీ ప్లాంట్‌లో ఉత్పత్తి షురూ

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:15 AM

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కీలక విమాన విడిభాగాల తయారీ..

శ్రీసిటీ ప్లాంట్‌లో ఉత్పత్తి షురూ

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కీలక విమాన విడిభాగాల తయారీ సంస్థ సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ వెల్లడించింది. ఈ ప్లాంట్‌లో తొలి బ్యాచ్‌ ప్రెసిషన్‌-మెషిన్డ్‌ ఏరోస్పేస్‌ కాంపోనెంట్స్‌ తయారీ చేపట్టినట్లు తెలిపింది. శ్రీసిటీలోని ప్లాంట్‌లో తయారైన ఉత్పత్తులను బ్రిటన్‌లోని తమ ప్లాంట్‌కు పంపించి అక్కడ అవసరమైన అన్ని నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఖాతాదారులకు సరఫరా చేయనున్నట్లు సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తెలిపింది.

Updated Date - Sep 11 , 2026 | 05:15 AM