రెండో రోజూ నష్టాలే..
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:11 AM
శీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అధిక ముడి చమురు ధరలు, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన శాంతి ఒప్పందంపై అనిశ్చితి, అమెరికా బాండ్ల వడ్డీ రేట్లు పెరగడం, విదేశీ నిధులు తరలిపోవడం వంటివి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
సెన్సెక్స్ 243 పాయింట్లు పతనం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అధిక ముడి చమురు ధరలు, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన శాంతి ఒప్పందంపై అనిశ్చితి, అమెరికా బాండ్ల వడ్డీ రేట్లు పెరగడం, విదేశీ నిధులు తరలిపోవడం వంటివి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 242.65 పాయింట్లు కోల్పోయి 72,529.07 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 707.72 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 64.05 పాయింట్ల నష్టంతో 22,716.20 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్ల స్థాయిలో ఉంది. బంగారం ధర మరింత తగ్గింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.1,400 తగ్గి రూ.1,48,600కు చేరుకుంది. కిలో వెండి ధర మాత్రం రూ.2.32 లక్షల వద్ద యథాతథంగా ఉంది.