Share News

బహిరంగ మార్కెట్‌ ద్వారా షేర్ల బైబ్యాక్‌

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:50 AM

లిస్టెడ్‌ కార్పొరేట్‌ కంపెనీలు బహిరంగ మార్కెట్‌ (స్టాక్‌ ఎక్స్ఛేంజీలు) ద్వారా సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేసే అవకాశాన్ని సెబీ పునఃప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఇది...

బహిరంగ మార్కెట్‌ ద్వారా షేర్ల బైబ్యాక్‌

ఆగస్టు 1 నుంచి అమల్లోకి..

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కార్పొరేట్‌ కంపెనీలు బహిరంగ మార్కెట్‌ (స్టాక్‌ ఎక్స్ఛేంజీలు) ద్వారా సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేసే అవకాశాన్ని సెబీ పునఃప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. బైబ్యాక్‌ గడువును మాత్రం 66 పని దినాలకు కుదించింది. షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి జూలై 1వ తేదీతో సెబీ విడుదల చేసిన కొత్త నియమావళిలోని ముఖ్య విషయాలు..

  • ఇకపై కంపెనీలు ప్రత్యేక విండో అవసరం ఏర్పాటు చేయాల్సిన లేకుండా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రెగ్యులర్‌ ట్రేడింగ్‌ మెకానిజం ద్వారానే సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఇది కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు బైబ్యాక్‌ సమర్థతను పెంచేందుకు తోడ్పడనుంది.

  • కొందరు ఇన్వెస్టర్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతున్నదన్న ఆరోపణలతో పాటు పన్ను సంబంధిత సమస్యల కారణంగా 2025లో సెబీ ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియను రద్దు చేసింది.

  • ఈ ప్రక్రియను పునఃప్రవేశపెట్టడంతో కార్పొరేట్‌ కంపెనీలు తమ వద్దనున్న అదనపు నగదు నిల్వలను షేర్‌హోల్డర్లకు తిరిగి పంచడంతో పాటు మార్కెట్లు బలహీనంగా ఉన్న సమయంలో షేరు ధరకు మద్దతునిచ్చేందుకు వెసులుబాటు లభించనుంది.

  • ప్రకటన చేసిన 4 పనిదినాల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా బైబ్యాక్‌ ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఆఫర్‌ ప్రారంభమై నాటి నుంచి 66 పనిదినాల్లో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. గతంలో ఇందుకు 6 నెలల సమయం ఉండేది.

ఇవి కూడా చదవండి..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 08 , 2026 | 05:50 AM