Share News

పెరిగిన సాగర్‌ సిమెంట్‌ నష్టాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:35 AM

సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో సాగర్‌ సిమెంట్‌ రూ.51.54 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

పెరిగిన సాగర్‌ సిమెంట్‌ నష్టాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో సాగర్‌ సిమెంట్‌ రూ.51.54 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.44.17 కోట్ల నష్టాలను నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ.606.20 కోట్ల నుంచి రూ.707.78 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.652.71 కోట్ల నుంచి రూ.776.50 కోట్ల నుంచి పెరగటం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించింది.

Updated Date - Oct 31 , 2026 | 01:36 AM