Gold Rules: నగల నిల్వలుపరిమితులు నిబంధనలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:50 AM
భారతీయులకు బంగారంపై మోజెక్కువే. ఏ శుభ కార్యానికైనా ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. సంపన్న కుటుంబాలైతే చెప్పే పనే లేదు. బంగారం వంటి విలువైన లోహాల కొనుగోలుకు శుభప్రదంగా భావించే....
భారతీయులకు బంగారంపై మోజెక్కువే. ఏ శుభ కార్యానికైనా ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. సంపన్న కుటుంబాలైతే చెప్పే పనే లేదు. బంగారం వంటి విలువైన లోహాల కొనుగోలుకు శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ, ధన త్రయోదశికి నగల దుకాణాలు కిటకిట లాడుతుంటాయి. ఆభరణాల కొనుగోళ్లకు లెక్క పక్కాగా ఉన్నంత వరకు ఓకే. లేకపోతే ఆదాయం పన్ను శాఖ నుంచి తిప్పలు తప్పవు.
మన దేశంలో బంగారం లేదా బంగారు ఆభరణాలు లేని ఇళ్లు ఉండవంటే ఆశ్చర్యం లేదు. చిన్నమెత్తు బంగారమైనా కొనందే ఇళ్లలో జరిగే ఏ శుభ కార్యమూ పూర్తి కాదు. వ్యక్తులు, కుటుంబాల వద్ద వీటి నిల్వలు చట్ట పరిమితికి లోబడి ఉన్నంత వరకు ఓకే. లెక్కాపక్కా లేకుండా ఎడాపెడా బంగారు ఆభరణాలు పోగేసుకుంటూ పోతే మాత్రం ఐటీ శాఖ కొరడా ఝుళిపిస్తుంది. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎంత మొత్తం బంగారం లేదా ఆభరణాలు కలిగి ఉండవచ్చనే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
పరిమితులు: నిజానికి ఎవరు ఎంత బంగారం లేదా ఆభరణాలు కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదు. కాకపోతే వీటిని తమ కష్టార్జితంతో సంపాదించినట్టు పన్ను చెల్లింపుదారులు ఐటీ అధికారులకు ఆధారాలతో సహా నిరూపించాలి. వారసత్వంగా వచ్చిన ఆభరణాలకూ ఇది వర్తిస్తుంది. రశీదు లేదా ఇతర పత్రాలు లేకపోయినా వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు(హెచ్‌యూఎ్‌ఫ) కొన్ని పరిమితులకు లోబడి బంగారం లేదా నగలు ఉంచుకోవచ్చు. అయితే ఈ పరిమితులు కుటుంబ సభ్యుల వ్యక్తిగత బంగారం లేదా ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. వాణిజ్యపరమైన లేదా పెట్టుబడి లాభాల కోసం కొని పెట్టుకున్న ఆభరణాలు, బంగారానికి వర్తించవు.
హెచ్‌యూఎ్‌ఫలు : కుటుంబ ఆదాయం, స్టేట్‌సను బట్టి ఈ పరిమితిని నిర్ణయిస్తారు. దీనికి ఒక నిర్దిష్ట స్థాయి లేదు. పెళ్లిళ్లు, వారసత్వం, కుటుంబ బహుమతులు వంటి అంశాల ఆధారంగా ఈ పరిమితిని నిర్ణయిస్తారు.
ఐటీ నోటీసులు అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా హెచ్‌యూఎ్‌ఫ సభ్యుడై ఉంటేనే నిబంధనలు వర్తిస్తాయి.
సోదాల్లో హెచ్‌యూఎ్‌ఫ కాని వ్యక్తి బంగారం లేదా ఆభరణాలు దొరికితే ఐటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు.
నిరూపించలేకపోతే కష్టాలే
ధ్రువ పత్రాలు చూపించాల్సిన అవసరం లేని స్థాయికి మించి బంగారం లేదా నగలు ఉంటే తిప్పలు తప్పవు. ఐటీ రిటర్న్‌లో పేర్కొన్న తమ ఆదాయం నుంచే వాటిని కొన్నట్టు నిరూపించాలి.
బహుమతులు లేదా వారసత్వంగా వస్తే?
ఇన్‌వాయి్‌స, గిఫ్ట్ డీడ్, సందర్భం, బంధువు, బహుమతి లేదా వారసత్వంగా అందిన బంగారం లేదా నగల విలువ ధ్రువ పత్రాలను సోదాలు జరిపే అధికారులకు చూపాలి.
మినహాయింపులు వర్తించని బంగారం, నగలు
పెట్టుబడి కోసం కొన్న బంగారం, గోల్డ్ ఈటీఎ్‌ఫలు.
నిల్వ చేసిన బంగారు బిస్కెట్లు, నాణేలు, కడ్డీలు.
సరైన ఆర్థిక వివరాలు లేకుండా ట్రేడింగ్, స్పెక్యులేషన్ కోసం నిల్వ చేసిన బంగారం, నగలు.
ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం లేదా నగలు ఉన్న వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు ఈ విషయాలు గుర్తుంచుకుని జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కనిపించినా ఉన్నదంతా ఐటీ అధికారులు ఊడ్చుకు పోయే ప్రమాదం ఉంది.
శిక్ష
మినహాయింపు పరిమితికి మించి ఉన్న బంగారం, ఆఽభరణాలకు సరైన లెక్క చెప్పలేకపోతే శిక్ష కూడా తీవ్రంగానే ఉంటుంది. సర్‌చార్జీ, సెస్సులతో కలిపి బంగారం, నగల విలువలో 60 శాతం పన్నుగా విధిస్తారు. అదనంగా వడ్డీ, జరిమానా కూడా తప్పవు. కొన్ని సందర్భాల్లో ఐటీ అధికారులు ఆ బంగారం, నగల మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు.