ఇక రిలయన్స్ ఐస్‌క్రీమ్‌లు
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:09 AM
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తాజాగా ఐస్‌క్రీమ్‌ల వ్యాపారంలోకి ప్రవేశించింది. బాంబే క్రీమరీ పేరుతో ఐస్‌క్రీమ్...
బాంబే క్రీమరీ పేరుతో మార్కెట్లోకి..
ఉత్పత్తుల ప్రారంభ ధర రూ.10
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తాజాగా ఐస్‌క్రీమ్‌ల వ్యాపారంలోకి ప్రవేశించింది. బాంబే క్రీమరీ పేరుతో ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆర్‌ఐఎల్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ అనుబంధ విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) మంగళవారం వెల్లడించింది. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ ఫార్మాట్లలో లభించనున్న బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌ల ధర రూ.10 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. తొలుత పశ్చిమ భారత మార్కెట్లో తన ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్
రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్.. అంతర్జాతీయ వినోద మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. తన స్ట్రీమింగ్ సేవలను యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), కెనడా, సింగపూర్‌కు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 12కు పైగా భాషల్లో 1.60 లక్షలకు పైగా గంటల కంటెంట్ పూర్తిగా ఆ దేశాల వినియోగదారులకూ అందుబాటులోకి రానుందని జియోహాట్‌స్టార్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..