Share News

మా షేర్లపై ఏఎస్ఎంను సమీక్షించండి

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:25 AM

తమ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై విధించిన అదనపు నిఘా చర్యల (ఏఎ్‌సఎం)ను సమీక్షించాలని అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా.. సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలను...

మా షేర్లపై ఏఎస్ఎంను సమీక్షించండి

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా

న్యూఢిల్లీ: తమ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై విధించిన అదనపు నిఘా చర్యల (ఏఎ్‌సఎం)ను సమీక్షించాలని అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా.. సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలను కోరింది. ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే ట్రేడింగ్‌ను అనుమతిస్తూ 5 శాతం సర్క్యూట్‌ బ్రేకర్‌ విధించడంతో కంపెనీ షేర్ల ప్రస్తుత ధర, వాస్తవ విలువను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. దివాలా చట్టం కింద నమోదైన దివాలా పిటిషన్‌, కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లపై ఎన్‌సీఎల్‌ఏటీ స్టే ఇచ్చినా ఇంకా తమ కంపెనీ షేర్లపై ఏఎ్‌సఎం కొనసాగించడం అనుచితమని పేర్కొంది.

కంపెనీ షేర్ల వాస్తవ విలువ కనుగొనేందుకు వీలుగా 100 శాతం మార్జిన్‌, గ్రాస్‌ సెటిల్‌మెంట్‌, అదనపు నిఘా డిపాజిట్‌, ప్రైస్‌ బ్యాండ్‌ సేఫ్‌గార్డ్స్‌ వంటి చర్యలు తీసుకుంటే ఏడు లక్షలకు పైగా ఉన్న రిటైల్‌ ఇన్వెస్టర్లకు మేలు చేస్తుందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా విజ్ఞప్తి చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

Updated Date - Jun 08 , 2026 | 01:25 AM