Share News

రుణ వసూళ్ల కోసం ఫోన్లు డిజేబుల్‌ చేయొద్దు: ఆర్‌బీఐ

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:50 AM

బ్యాంకుల రుణ వసూళ్లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము ఇచ్చిన వ్యక్తిగత, వాహన లేదా గృహ రుణాల చెల్లింపుల్లో విఫలమైన...

రుణ వసూళ్ల కోసం ఫోన్లు డిజేబుల్‌ చేయొద్దు: ఆర్‌బీఐ

ముంబై: బ్యాంకుల రుణ వసూళ్లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము ఇచ్చిన వ్యక్తిగత, వాహన లేదా గృహ రుణాల చెల్లింపుల్లో విఫలమైన ఖాతాదారుల నుంచి రుణ వసూళ్ల కోసం.. బ్యాంకులు వారి ఫోన్లు, ల్యాప్‌ట్యా్‌ప్సను డిజేబుల్‌ (పని చేయకుండా) చేయడం ఏమాత్రం సమర్ధనీయం కాదని స్పష్టం చేసింది. అయితే వారి ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ తాము అందించిన రుణాలతో కొని ఉంటే మాత్రం వాటిని డిజేబుల్‌ చేయవచ్చని తెలిపింది. 2027 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. రుణ బకాయిల వసూళ్ల కోసం అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక మాత్రమే బ్యాంకులు ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు పనిచేయకుండా చేయడం గురించి ఆలోచించాలని సూచించింది. అప్పుడు కూడా ఖాతాదారులకు వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎ్‌సలు, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎ్‌సల ఫీచర్లను అడ్డుకోకూడదని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Updated Date - Aug 07 , 2026 | 04:50 AM