Share News

దేశంలో కీలక బ్యాంక్‌లు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:03 AM

ప్రభుత్వ రంగ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)తో పాటు ప్రైవేట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ను దేశీయ ఆర్థిక వ్యవస్థలో కీలక బ్యాంకులుగా కొనసాగిస్తున్నట్లు..

దేశంలో కీలక బ్యాంక్‌లు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ

ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)తో పాటు ప్రైవేట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ను దేశీయ ఆర్థిక వ్యవస్థలో కీలక బ్యాంకులుగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ సోమవారం తెలిపింది. ఈ మార్చి 31 నాటికి సమీకరించిన డేటా ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైనందున ఈ మూడు బ్యాంకులు అదనపు మూలధన నిల్వలను నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ తొలిసారిగా 2014 జూలై 22న ఆర్‌బీఐ వ్యవస్థాగతంగా కీలక బ్యాంకుల నియమావళిని జారీ చేసింది. ఆ తర్వాత 2023 డిసెంబరులో అప్‌డేట్‌ చేసింది. 2015, 2016లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఈ జాబితాలో ఉండేవి. 2017లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా లిస్ట్‌లో చేరింది.

Updated Date - Nov 24 , 2026 | 04:05 AM