రామ్‌కీ ఇన్‌ఫ్రాకు రూ.1,402 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:04 AM
రామ్‌కీ ఇన్‌ఫ్రా.. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్‌షి్‌ప లిమిటెడ్ (ఎంఐటీఎల్) నుంచి రూ.1401.84 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది...
రామ్‌కీ ఇన్‌ఫ్రా.. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్‌షి్‌ప లిమిటెడ్ (ఎంఐటీఎల్) నుంచి రూ.1401.84 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కింద ఢిల్లీ, ముంబై పారిశ్రామిక కారిడార్‌లో (డీఎంఐసీ) భాగంగా నిర్మాణం అవుతున్న డిఘీ పోర్ట్ ఇండస్ర్టియల్ ఏరియా (డీపీఐఏ) ప్రాజెక్టు తొలిదశకు అవసరమైనఅభివృద్ధి పనులు రామ్‌కీ చేపట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్టు లభించిన నాటి నుంచి 930 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.