మేం తప్పు చేయలేదు..
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:13 AM
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా మరోసారి తమ వైఖరిని సమర్ధించుకున్నారు. తమ కంపెనీ ఆదాయ వివరాలను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు బృందమే...
15 రోజుల్లో మరోసారి సమాచారం అందిస్తాం
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ మెహతా
న్యూఢిల్లీ: రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా మరోసారి తమ వైఖరిని సమర్ధించుకున్నారు. తమ కంపెనీ ఆదాయ వివరాలను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు బృందమే తప్పుగా అర్థం చేసుకుందన్నారు. తాము సమర్పించిన ఆదాయ వివరాలను కాకుండా స్థూల లాభాన్నే ఆదాయం అనుకోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఉదాహరణకు రూ.30,000 విలువైన రెండు గ్రాముల బంగారం అమ్మితే రూ.1,000 స్థూల లాభం, రూ.500 నికర లాభం వస్తుందన్నారు. ఇక్క డ సెబీ దర్యాప్తు బృందం.. తాము పేర్కొన్న రూ.30,000 ఆదాయాన్ని కాకుండా రూ.1,000 స్థూల లాభాన్ని ఆదాయంగా పరిగణనలోకి తీసుకుందన్నారు. రూ.30,000 ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఐదేళ్లలో తమ ఆదాయం రూ.15.15 లక్షల కోట్లనే విషయం అర్థమవుతుందని మెహతా తెలిపారు. దీనికి సంబంధించి లక్షలాది పేజీలతో కూడిన 300 నుంచి 400 జీబీ సమాచారాన్ని సెబీకి ఇప్పటికే పంపామన్నారు. అయితే సెబీ ఈ సమాచారంలో పేర్కొన్న ఫైల్స్‌ను కనుక్కోలేక పోవడంతో 15 రోజుల్లో మరోసారి డాక్యుమెంట్ల రూపంలో అందజేస్తామని మెహతా చెప్పారు. అప్పుడు అన్ని అపోహలు తొలగిపోతాయన్నారు. మరోవైపు సెబీ చర్యల నేపథ్యంలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కి ఉన్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..