రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ పార్క్
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:47 AM
పల్సస్ గ్రూప్ హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ ఐటీ పార్కును పెద్దఎత్తున అభివృద్ధి చేస్తోంది....
పల్సస్ గ్రూప్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పల్సస్ గ్రూప్ హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ ఐటీ పార్కును పెద్దఎత్తున అభివృద్ధి చేస్తోంది. రూ.500 కోట్ల పెట్టుబడితో 36 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 6,000 మందికి ప్రత్యక్షంగా 30,000మందికి పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ఐటీ సేవల పార్కు, సెజ్ హోదా ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఈ మధ్యనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.