ప్రీమియర్ ఎనర్జీలో 5.29 శాతం వాటా విక్రయం
ABN , Publish Date - May 27 , 2026 | 03:46 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ (పీఈఎల్) షేర్లలో భారీ బ్లాక్ డీల్ చోటు చేసుకుంది. ఈ డీల్ ద్వారా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ (పీఈఎల్) షేర్లలో భారీ బ్లాక్ డీల్ చోటు చేసుకుంది. ఈ డీల్ ద్వారా కంపెనీ ప్రధాన ప్రమోటర్లు తమ వాటా నుంచి 5.29 శాతం (2,39,85,197 షేర్లు) వాటాను విక్రయించారు. డీల్‌లో భాగంగా ఒక్కో షేరును సగటున రూ.955 చొప్పున రూ.2,290.59 కోట్లకు విక్రయించారు. నోమురా అసెట్, క్యాపిటల్ గ్రూప్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, అబుదాబీకి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్, మన దేశానికి చెందిన కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ వాటాలను కొనుగోలు చేశాయి. దీంతో కంపెనీ ఈక్విటీలో ప్రమోటర్ల వాటా 63.94 శాతం నుంచి 58.65 శాతానికి తగ్గింది.
ఇవి కూడా చదవండి..
ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..