ఓయో రూ.6,650 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:54 AM
గొలుసుకట్టు హోటళ్ల నిర్వహణ ప్లాట్‌ఫామ్ ఓయో మాతృ సంస్థ ప్రిస్మ్ రూ.6,650 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ...
గొలుసుకట్టు హోటళ్ల నిర్వహణ ప్లాట్‌ఫామ్ ఓయో మాతృ సంస్థ ప్రిస్మ్ రూ.6,650 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నుంచి ఆమోదం లభించినట్లు తెలిసింది. ఈ ఐపీఓ లో భాగంగా ఓయో మార్కెట్ విలువను 700-800 కోట్ల డాలర్ల (రూ.66,500-76,000 కోట్లు) స్థాయిలో లెక్కగట్టే అవకాశం ఉంది. కాగా అంతర్జాతీయ శీతల పానీయాల దిగ్గజం కోకా-కోలా తన భారత అనుబంధ విభాగమైన హిందుస్థాన్ కోకా-కోలా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌సీసీహెచ్)ను పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదు చేయాలని భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..