బీన్యూ మొబైల్స్‌లో ఒప్పో రెనో 16
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:25 AM
బీన్యూ మొబైల్స్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తన షోరూమ్స్‌ల్లో ఒప్పో రెనో 16 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కరీంనగర్‌లో మై విలేజ్ షో టీమ్ సభ్యులు గంగవ్వ, చందు..
హైదరాబాద్: బీన్యూ మొబైల్స్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తన షోరూమ్స్‌ల్లో ఒప్పో రెనో 16 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కరీంనగర్‌లో మై విలేజ్ షో టీమ్ సభ్యులు గంగవ్వ, చందు, రవి శ్రీకాంత్.. ఈ ఫోన్‌ను విడుదల చేయగా కర్నూలులో సినీ నటి దివి.. రెనో 16ను లాంఛనంగా ఆవిష్కరించారు. 8 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.61,999గా ఉండగా 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.67,999గా ఉంది. కాగా మాన్‌సూన్ ఆఫర్స్ పేరుతో రూ.11,999 ధరకు స్మార్ట్ ఫోన్‌తో పాటు సౌండ్ బార్‌ను, రూ.12,999కి స్మార్ట్ ఫోన్ సహా ఎయిర్ ఫ్రైయర్, రూ.16,999కే స్మార్ట్ టీవీతో పాటు 7కేజీ వాషింగ్ మెషిన్‌ను అందిస్తున్నట్లు బీన్యూ మొబైల్స్ వెల్లడించింది. కాగా గడచిన 12 సంవత్సరాలుగా వినియోగదారులకు నమ్మకమైన సేవలందిస్తున్న బీన్యూ మొబైల్స్.. 80 లక్షలకు పైగా వినియోగదారులతో దక్షిణాదిలో లైఫ్‌స్టైల్ హబ్‌గా ఎదిగిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీన్యూ మొబైల్స్.. ఏపీ, తెలంగాణల్లో 160కి పైగా స్టోర్లను నిర్వహిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..