మంగళూరు వద్ద మరో వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రం
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:54 AM
దేశంలో మరో వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రం రాబోతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద 17.5 లక్షల టన్నుల ముడి చమురు...
17.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం
ఆమోదం తెలిపిన ఓఎన్‌జీసీ డైరెక్టర్ల బోర్డు
న్యూఢిల్లీ: దేశంలో మరో వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రం రాబోతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద 17.5 లక్షల టన్నుల ముడి చమురు నిల్వ సామర్ధ్యంతో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంఽధించిన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు ఓఎన్‌జీసీ వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేసేది? ఎప్పటిలోగా పూర్తవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర భారీగా పెరిగినప్పుడు లేదా సరఫరాల్లో అంతరాయం ఏర్పడినపుడు అత్యవసర వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 53.3 లక్షల టన్నుల సామర్థ్యంతో విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాడూరుల్లో మూడు చోట్ల భారీ రాతి సొరంగాల్లో మూడు వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్