దీపావళి సేల్.. ఆఫ్‌లైన్‌లో 20 శాతం వరకూ తగ్గిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 09:13 PM
దీపావళి పండుగ సీజన్ సందర్భంగా ఆఫ్‌లైన్‌లో (రిటైల్ స్టోర్లు) స్మార్ట్ ఫోన్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం నుంచి 20 శాతం మేర తగ్గాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ మార్కెట్ అసోసియేషన్ (AIMRA) పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ సీజన్ సందర్భంగా ఆఫ్‌లైన్‌లో (రిటైల్ స్టోర్లు) స్మార్ట్ ఫోన్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం నుంచి 20 శాతం మేర తగ్గాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ మార్కెట్ అసోసియేషన్ (AIMRA) పేర్కొంది. ధరలు పెరిగిన కారణంగా డిమాండ్ తగ్గిందని తెలిపింది. ధనత్రయోశి మొదలు దీపావళి వరకూ దేశంలోని ప్రధాన రిటైల్ స్టోర్లలో కస్టమర్ల రాక ఎప్పటివలెనే ఉందని కూడా ఏఐఎమ్ఆర్ఏ పేర్కొంది. అయితే, పండుగకు ముందు వారం రోజుల్లో విక్రయాలు మాత్రం గతంలో పోలిస్తే 40 శాతం తగ్గాయని తెలిపింది. మరిన్ని డిస్కౌంట్స్ రావచ్చన్న అంచనాలతో ప్రజలు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అమ్మకాలు తగ్గాయని ఏఐఎమ్ఆర్ఏ తన నివేదికలో వెల్లడించింది.
ఏఐఎమ్ఆర్ఏ నివేదిక ప్రకారం, రిటైల్ స్టోర్లలో రూ.30 వేల నుంచి రూ.60 వేల మధ్య ధరలు ఉన్న ఫోన్స్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఆ తరువాత స్థానంలో ప్రీమియం ఫోన్స్ ఉన్నాయి. యాపిల్, మోటోరోలా ఫోన్స్ ఈసారి అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఐఫోన్ 15, 16, 17 మోడల్స్ అమ్మకాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని ఏఐఎమ్ఆర్ఏ పేర్కొంది. ప్రీమియం సెగ్మెంట్లో అత్యధిక అభివృద్ధి నమెదు చేసిన బ్రాండ్స్‌లో గూగుల్ పిక్సెల్ ముందు వరుసలో నిలిచింది. షావొమీ ఫోన్స్ విక్రయాలు కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి.
ఈసారి రియల్మీ ఫోన్ల అమ్మకాలు అన్ని ధరల సెగ్మెంట్స్‌లో తగ్గిపోయాయని ఏఐఎమ్ఆర్ఏ తన నివేదికలో పేర్కొంది. దాదాపు 50 శాతం వరకూ తగ్గాయని చెప్పింది. పోటీదారులైన షావోమీ, శాంసంగ్, వీవోతో పోలిస్తే రియల్మీ ధరలు కాస్త ఎక్కువగా ఉండటం, కొత్త ఉత్పత్తలు లేకపోవడం విక్రయాలపై ప్రభావం చూపించాయని ఏఐఎమ్ఆర్ఏ పేర్కొంది. ఇక శాంసంగ్ ఫోన్ల ఆన్లైన్, ఆఫ్‌లైన్ ధరల మధ్య వ్యత్యాసం కూడా విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపించిందని వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 772 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ఫిబ్రవరి 4-9 తేదీల్లో భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027