Share News

ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల కోసం బ్యాంకుల వేట

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:17 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలతో దేశీయ బ్యాంకులు ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్ల కోసం పెద్దఎత్తున రంగంలోకి దిగాయి....

ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల కోసం బ్యాంకుల వేట

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలతో దేశీయ బ్యాంకులు ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్ల కోసం పెద్దఎత్తున రంగంలోకి దిగాయి. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లుగా పిలిచే ఈ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ ఆఫర్‌ చేస్తూ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుతో సహా ప్రధాన బ్యాంకులన్నీ పెద్దఎత్తున ప్రచారానికి దిగాయి. బ్యాంకులు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఈ ఖాతాల ద్వారా సేకరించే ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేసి, అందుకు సమానమైన రూపాయలు పొందవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

దీంతో బ్యాంకులపై ఫారెక్స్‌ మార్కెట్లో ఏర్పడే ఆటుపోట్ల ప్రభావమూ ఉండదు. ఈ సౌలభ్యంతో బ్యాంకులు ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్ల సమీకరణ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాయి.

Updated Date - Jun 12 , 2026 | 05:17 AM